మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ అరెస్ట్.. కుప్పలుతెప్పలుగా ఆయుధాలు సీజ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-28 04:03:43  IST  )

మణిపూర్‌కు చెందిన నిషేధిత మిలిటెంట్ సంస్థ కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ ‌అగ్రనేతను ఢిల్లీలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ అరెస్ట్.. కుప్పలుతెప్పలుగా ఆయుధాలు సీజ్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో రక్షణ శాఖ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మణిపూర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (KCP) అగ్రనేత హవోబిజమ్ దిలీప్ సింగ్‌ను భద్రతా దళాలు పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నాయి. ఢిల్లీలో ఒక అత్యంత రహస్యమైన సమావేశంలో పాల్గొనేందుకు నిందితుడు ఇక్కడికి వచ్చినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. మోస్ట్ వాంటెడ్ మిలిటెంట్ లీడర్ హవోబిజమ్ దిలీప్ సింగ్‌ కదలికలపై నిఘా పెట్టిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, మణిపూర్ పోలీస్, కేంద్ర నిఘా సంస్థలు (Central Intelligence Agencies) ఉమ్మడిగా మెరుపు దాడి చేసి అతడిని అరెస్ట్ చేశాయి. హవోబిజమ్ దిలీప్ సింగ్ మణిపూర్‌లో అనేక అరాచకాలకు పాల్పడినట్లు రికార్డులు ఉన్నాయి. దేశద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గాను అతనిపై ఇప్పటికే ‘ఉపా’ (Unlawful Activities Prevention Act) చట్టం కింద 12కు పైగా తీవ్రమైన కేసులు నమోదయ్యాయి.

మణిపూర్‌లో భారీగా ఆయుధాల వేట..

అరెస్ట్ అనంతరం ఢిల్లీ పోలీసులు మిలిటెంట్ లీడర్‌ హవోబిజమ్ దిలీప్ సింగ్‌ను తమదైన శైలిలో విచారించారు. దీంతో అతడు వెల్లడించిన రహస్య సమాచారం ఆధారంగా భద్రతా సంస్థలు తక్షణమే రంగంలోకి దిగాయి. మణిపూర్‌లోని కాక్‌చింగ్ (Kakching) జిల్లాలో భద్రతా దళాలు భారీ ఎత్తున గాలింపు, రికవరీ ఆపరేషన్ చేపట్టాయి. ఇందులో భాగంగా ఉగ్రవాదులు దాచిపెట్టిన పెద్ద ఎత్తున అత్యాధునిక ఆయుధాలు, భారీగా మందుగుండు సామగ్రి (Arms and Ammunition), ఇతర సైనిక సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. వాటితో పాటు విభిన్న రంగుల బ్యాగులు, పెద్ద తార్పాలిన్ షీట్లు, ప్లాస్టిక్ సంచులు, ఒక రెడ్‌మి 13C మొబైల్ ఫోన్‌ను సీజ్ చేసినట్లు భద్రతా సంస్థలు అధికారికంగా ప్రకటించాయి.

హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా ఎయిర్ స్ట్రైక్.. ఇరాన్ సైనిక స్థావరంపై బాంబుల వర్షం

Next Story