హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా ఎయిర్ స్ట్రైక్.. ఇరాన్ సైనిక స్థావరంపై బాంబుల వర్షం

by Kema Shiva Kumar |

హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా తెల్లవారుజామున భారీ వైమానిక దాడులు జరిపింది.

హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా ఎయిర్ స్ట్రైక్.. ఇరాన్ సైనిక స్థావరంపై బాంబుల వర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: అగ్రదేశం అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తాజాగా అమెరికా హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలోని ఇవాళ తెల్లవారుజామున ఇరాన్ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు నిర్వహించింది. యూఎస్ ఫోర్సెస్, అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఆ స్థావరం ముప్పుగా పరిణమించడంతోనే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని వాషింగ్టన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన పలు డ్రోన్లను అమెరికా దళాలు విజయవంతంగా అడ్డుకుని కూల్చివేశాయి. ఇరాన్ ఓడరేవు నగరం బందర్ అబ్బాస్ (Bandar Abbas) తూర్పు ప్రాంతంలో 5వ డ్రోన్‌ను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ ఫెసిలిటీయే లక్ష్యంగా ఎయిర్ స్ట్రైక్ జరిగనట్లుగా అమెరికా రక్షణ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. దీంతో అప్రమత్తమైన ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు (Air Defence Systems) యాక్టివేట్ అయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి శాంతి చర్చలు జరుగుతున్న తరుణంలోనే ఈ దాడులు జరగడం ప్రపంచ దేశాలకు గుబులు పుట్టిస్తోంది.

Next Story