మేడిపల్లి హత్య కేసు.. తల, కాళ్లు చేతులు లేకుండానే అంత్యక్రియలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-26 04:03:43  IST  )

మేడిపల్లి మర్డర్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య స్వాతిని ముక్కలు ముక్కలు చేసి అతి దారుణంగా హత్య చేశాడు.

మేడిపల్లి హత్య కేసు.. తల, కాళ్లు చేతులు లేకుండానే అంత్యక్రియలు
X

దిశ, వెబ్ డెస్క్: మేడిపల్లి మర్డర్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్య స్వాతిని ముక్కలు ముక్కలు చేసి అతి దారుణంగా హత్య చేశాడు. అనంతరం శరీర భాగాలను మూసీలో పడేశాడు. అయితే ఈ కేసులో స్వాతి మొండెం తప్ప ఇతర శరీర భాగాలు పోలీసులకు దొరకలేదు. మూసీలో గాలింపు చర్యలు చేపట్టినా వర్షాల కారణంగా భారీగా వరద ప్రవాహం ఉండటంతో 10 కిమీల వరకు వెతికి వెనక్కి తగ్గారు.

ఇక సోమవారం రాత్రి స్వాతి డెడ్ బాడీని వారి స్వగ్రామం కామారెడ్డిగూడకు తరలించారు. పోలీసుల బందోబస్తు మధ్యలో డెడ్ బాడీని కామారెడ్డిగూడకు తరలించారు. అయితే కాళ్లు, చేతులు, తల దొరక్కపోవడంతో కేవలం మొండానికే అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు కూడా పోలీసు బందోబస్తు మధ్యనే జరిగాయి. గ్రామస్థులంతా మహేందర్ రెడ్డిపై, అతడి కుటుంబంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని ఊర్లో అడుగుపెట్టనివ్వమని హెచ్చరిస్తున్నారు. అతడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Read More..

Triangle love: ప్రాణం తీసిన ట్రయాంగిల్ ప్రేమకథ

Next Story