- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Triangle love: ప్రాణం తీసిన ట్రయాంగిల్ ప్రేమకథ
ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓ యువతి ప్రాణం తీసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ బ్లడ్ బ్యాంకులో ల్యాబ్ అసిస్టెంట్లుగా అరుణ్ కుమార్, ప్రతిభా భారతి, స్వాతి అనే ముగ్గురు పనిచేస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఓ యువతి ప్రాణం తీసింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ బ్లడ్ బ్యాంకులో ల్యాబ్ అసిస్టెంట్లుగా అరుణ్ కుమార్, ప్రతిభా భారతి, స్వాతి అనే ముగ్గురు పనిచేస్తున్నారు. కాగా రెండేళ్లుగా అరుణ్ కుమార్, ప్రతిభా భారతి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. మరోవైపు స్వాతితో సైతం అరుణ్ కుమార్ సన్నిహితంగా ఉండేవాడు. ఈ విషయం అతడి ప్రేయసి ప్రతిభా భారతికి నచ్చలేదు. దీంతో ఎలాగైనా స్వాతిని అరుణ్ కుమార్‌కు దూరం చేయాలని అనుకుంది.
ఈ క్రమంలో నేరుగా స్వాతికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చింది. అన్నా వదినా అంటూ నా లవర్ తోనే ప్రేమ వ్యవహారం నడుపుతున్నావా అంటూ బూతులు తిట్టింది. మీ ప్రేమ విషయం నాకు తెలిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రోజు ల్యాబ్‌కు రండి మీ సంగతి తేలుస్తానంటూ హెచ్చరించింది. దీంతో భయపడిపోయిన స్వాతి తాను ఉంటున్న ప్రైవేటు హాస్టల్‌లోనే చున్నీతో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Read More..
మేడిపల్లి హత్య కేసు.. తల, కాళ్లు చేతులు లేకుండానే అంత్యక్రియలు






