- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడ రైల్వే స్టేషన్లో దారుణం.. కళ్లముందే యువకుడి హత్య
విజయవాడ రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యంమత్తలో ఇద్దరు స్నేహితుల మధ్య చెలరేగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాము - సాయి అనే ఇద్దరు స్నేహితులు విజయవాడ రైల్వేస్టేషన్ కు మద్యంసీసాలతో వెళ్లారు. అక్కడ ఏదో విషయమై ఇద్దరి మధ్య గొడవ జరగ్గా రాము ఆవేశంతో సాయిపై దాడి చేశాడు. తన చేతిలో ఉన్న మద్యం బాటిల్ తో సాయి మెడపై పొడవడంతో.. తీవ్ర రక్తస్రావంతో అతను అక్కడే మరణించాడు. ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో స్పాట్ కు చేరుకున్న పోలీసులు.. నిందితుడు రాముని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అతనిపై గతంలోనే 15 కేసులు నమోదైనట్లు సమాచారం. సాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి.. అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
దారుణం.. జిల్లాలో జంటహత్యల కలకలం
Next Story






