- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దారుణం.. జిల్లాలో జంటహత్యల కలకలం
అనంతపురం జిల్లాలో జంటహత్యల కలకలం రేగింది. తల్లి, కొడుకు దారుణ హత్యకు గురయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లాలో జంటహత్యల కలకలం రేగింది. తల్లి, కొడుకు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. శింగనమల మండలం తరిమెలలో అంగన్వాడీ టీచర్ యల్లమ్మ (38), కొడుకు చిన్నా (22) హత్యకు గురయ్యారు. దీనిపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లప్ప అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య యల్లమ్మ స్థానిక అంగన్వాడీలో టీచర్ గా పనిచేస్తోంది. నల్లప్ప ఈ మధ్యకాలంలోనే మరణించగా.. మొదటి భార్య - రెండో భార్య కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు తారాస్థాయిలో జరిగాయి. ఈ క్రమంలోనే యల్లమ్మ, అతని కొడుకు హత్యకు గురికావడంతో మొదటిభార్య కొడుకులే వారిని చంపి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, స్పాట్ లో సేకరించిన ఆధారాలు, స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నల్లప్ప మొదటి భార్య, అతని కొడుకులిద్దరినీ విచారిస్తున్నారు.






