ఎన్టీఆర్ జిల్లాలో కలకలం.. చిలుకూరులో వ్యక్తి దారుణహత్య

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-07 08:21:29  IST  )

ఎన్టీఆర్ జిల్లా చిలుకూరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో కలకలం.. చిలుకూరులో వ్యక్తి దారుణహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఘోర కలి జరిగింది. చిలుకూరు గ్రామంలో ఒక వ్యక్తి అత్యంత దారుణంగా హత్యకు గురికావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడిని చిలుకూరు గ్రామానికి చెందిన అమరలింగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. స్థానిక సమాచారం ప్రకారం.. మంగళవారం ఉదయం కాచవరం-చిలుకూరు రోడ్డు పక్కన ఉన్న ఒక చెట్టు కింద అమరలింగేశ్వరరావు మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి ప్రాణాలు తీసినట్లు మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి స్పష్టమవుతోంది. రక్తపు మడుగులో ఉన్న మృతదేహాన్ని చూసి గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే ఇబ్రహీంపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్ టీమ్ మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో ఘటనా స్థలంలో కీలక ఆధారాలను సేకరించారు. ప్రాథమిక విచారణ అనంతరం.. పదునైన కత్తులు లేదా వేటకొడవళ్లతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమా? లేక భూ వివాదాలు లేదా వ్యక్తిగత గొడవలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు సమాచారం.

అన్నమయ్య జిల్లాలో జూనియర్ లాయర్ దారుణహత్య

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. 14.7 కిలోల గంజాయి స్వాధీనం

Next Story