అన్నమయ్య జిల్లాలో జూనియర్ లాయర్ దారుణహత్య

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-04-07 08:20:43  IST  )

అన్నమయ్య జిల్లాలో పాతకక్షల నేపథ్యంలో జూనియర్ లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు.

అన్నమయ్య జిల్లాలో జూనియర్ లాయర్ దారుణహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో క్రైం రేటు రోజురోజుకూ పెరుగుతోంది. వివాహేతర సంబంధాలు, భూ వివాదాలు, పర్సనల్ పగలు ఇలా రకరకాల కారణాలతో ప్రతిరోజూ దారుణమైన హత్యోదంతాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ యువ న్యాయవాది హత్యకు గురయ్యారు. పీలేరు నియోజకవర్గం కేవీ పల్లి మండలం వడ్డిపల్లికి చెందిన న్యాయవాది ఎల్లయ్యను సోమవారం రాత్రి దారిదోపిడీ ముఠా దారుణంగా హతమార్చింది. తన ఇంటివద్ద ఉన్న ఎల్లయ్యను రాళ్లతో కొట్టి చంపారు.

గతంలో వడ్డిపల్లి గ్రామంలో కొందరు యువకులు ముఠాగా ఏర్పడి దారిదోపిడీలకు పాల్పడేవారు. ఈ కేసులో ఎల్లయ్య పోలీసులకు వారిగురించి సమాచారమిచ్చి పట్టించారు. అప్పటి నుంచి ఎల్లయ్యపై ఆ ముఠా కక్షగట్టింది. చంపేస్తామని బెదిరించగా.. ప్రాణభయంతో ఎల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తుపాకీ లైసెన్సు కోసం అప్లై చేసుకున్నారు. ఈలోగానే దోపిడీ ముఠా ఎల్లయ్యపై దాడి చేసి దారుణంగా చంపేసింది.

ఎన్టీఆర్ జిల్లాలో కలకలం.. చిలుకూరులో వ్యక్తి దారుణహత్య

Next Story