శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. 14.7 కిలోల గంజాయి స్వాధీనం

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-07 04:40:19  IST  )

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి మాదకద్రవ్యాలు కలకలం రేపాయి. అధికారుల తనిఖీల్లో 14.7 కిలోల గంజాయి పట్టుబడింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ తనిఖీలు.. 14.7 కిలోల గంజాయి స్వాధీనం
X

దిశ, వెబ్‌డెస్క్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో మరోసారి భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడటం కలకలం రేపింది. ఇవాళ కస్టమ్స్ (Customs), ఎయిర్‌పోర్టు భద్రతా అధికారులు జరిపిన తనిఖీల్లో భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ వ్యక్తి ప్రవర్తనపై అధికారులకు అనుమానం కలిగింది. దీంతో అతడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. రహస్యంగా దాచి ఉంచిన 14.7 కిలోల గంజాయి లభ్యమైంది. అనంతరం వెంటనే అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే పట్టుబడిన గంజాయిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారు, దీనిని ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ స్మగ్లింగ్ వెనుక ఏదైనా అంతర్జాతీయ ముఠా ఉందా..? అనే కోణంలో అధికారులు నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. గత కొద్దిరోజులుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో వరుసగా డ్రగ్స్, గంజాయి పట్టుబడుతుండటంతో అధికారులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.

Next Story