బెంగళూరులో 'లక్కీ భాస్కర్' సీన్.. రూ. 3 కోట్లు స్వాహా చేసిన బ్యాంక్ మేనేజర్

by Malleboina Mahesh |   (  Updated:2025-12-30 05:53:36  IST  )

సినిమా స్టైల్‌లో సామాన్య ఖాతాదారులను మోసం చేసి కోట్లాది రూపాయలు కాజేసిన ఓ బ్యాంక్ మేనేజర్ బాగోతం బెంగళూరులో సంచలనం సృష్టిస్తోంది.

బెంగళూరులో లక్కీ భాస్కర్ సీన్.. రూ. 3 కోట్లు స్వాహా చేసిన బ్యాంక్ మేనేజర్
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా స్టైల్‌లో సామాన్య ఖాతాదారులను మోసం చేసి కోట్లాది రూపాయలు కాజేసిన ఓ బ్యాంక్ మేనేజర్ బాగోతం బెంగళూరులో సంచలనం సృష్టిస్తోంది. నగరంలోని మల్లేశ్వరం 13వ క్రాస్ ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంక్ మేనేజర్ రఘు, సుమారు 41 మంది ఖాతాదారులను నమ్మించి వంచించినట్లు బయటపడింది. ఖాతాదారుల నుంచి ఖాళీ చెక్కులు, వారి మొబైల్ ఫోన్లకు వచ్చే ఓటీపీలను (OTP) చాకచక్యంగా సేకరించిన మేనేజర్, వారు బ్యాంకులో కుదవ పెట్టిన బంగారం పైనే గుట్టుచప్పుడు కాకుండా రుణాలు తీసుకున్నాడు.

ఈ విధంగా ఖాతాదారులకు తెలియకుండా వారి పేరుతో దాదాపు రూ. 3.11 కోట్ల రుణాన్ని మేనేజర్ రఘు డ్రా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల బ్యాంకులో జరిగిన ఉన్నతాధికారుల ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమ లావాదేవీలన్నీ బయటపడ్డాయి. సొంత బ్యాంకు ఖాతాదారుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ భారీ మోసానికి పాల్పడిన మేనేజర్‌పై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటన ఇప్పుడు కన్నడ రాష్ట్రంతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.

Read More..

నగరం నడిబొడ్డున మరో ఘోరం.. ఇంటి యజమానురాలి దారుణ హత్య

Next Story