- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాత్రి వేళలో గంజాయి సప్లై.. బిహార్ వ్యక్తులను పట్టుకున్న స్థానికులు
ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) కల్చర్ చాపకిందనీరులా పల్లెలకు కూడా పాకేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్ (Drugs), గంజాయి (Ganja) కల్చర్ చాపకిందనీరులా పల్లెలకు కూడా పాకేసింది. దీంతో గ్రామాల్లోని యువత గంజాయికి బానిసలు అవుతున్నారు. బంగారు భవిష్యత్తును కాళ్లదన్నుకుని నిత్యం మత్తులో జోగుతున్నారు. అదేవిధంగా కొందరు దొంగతనాలు, నేరాలకు పాల్పడుతుంటే.. మరికొందరు అనారోగ్యాల బారిన పడి కాటికి కాళ్లుచాపుతూ.. కన్నోళ్లకు కడపుకోతను మిగుల్చుతున్నారు. ఈ నేపథ్యంలోనే యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి (Bhudan Pochampally) మండల కేంద్రంలో యువకులకు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న బిహార్ (Bihar) వాసిని స్థానికులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు వారిపైకి కత్తులతో దాడి చేసేందుకు యత్నించగా.. చాకచక్యంగా వ్యవహరించి ఒకరిని పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది.
Read More..






