ధర్మోరాలో దారుణం.. ఇద్దరి హత్య

by I. Sairam |   (  Updated:2025-08-25 13:50:45  IST  )

మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామంలో దారుణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు.

ధర్మోరాలో దారుణం.. ఇద్దరి హత్య
X

దిశ, మాక్లూర్: మాక్లూర్ మండలం ధర్మోరా గ్రామంలో దారుణం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. ధర్మోరా గ్రామానికి చెందిన నడిపి గంగాధర్, సాయిలు ఇద్దరు తండ్రి కొడుకులు. అయితే వీరిద్దరికి జిలకర ప్రసాద్ అనే వ్యక్తితో ఆదివారం ఉదయం గ్రామంలో గొడవ జరిగింది. గొడవను మనసులో ఉంచుకుని తిరిగి గంగాధర్, సాయిలు ఇంటి పైకి జిలకర ప్రసాద్ తన స్నేహితుడితో కలిసి దాడికి వచ్చాడు. ఈ క్రమంలో సాయిలు కుటుంబ సభ్యులు ప్రతి దాడి చేసి కంట్లో కారం కొట్టి, తాళ్లతో కట్టేసి హత్య చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను తరలించి సాయిలు కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read More..

రాత్రి వేళలో గంజాయి సప్లై.. బిహార్ వ్యక్తులను పట్టుకున్న స్థానికులు

Next Story