- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టపగలు నడిరోడ్డుపై భార్యను కాల్చి చంపిన భర్త
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య .. అతని గతం తెలిసి దూరంగా ఉంటోంది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న భర్త.. ఆమె కోసం దారిలో కాపుకాసి తుపాకీతో విచక్షణా రహితంగా కాల్చి చంపాడు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య .. అతని గతం తెలిసి దూరంగా ఉంటోంది. దీంతో ఆమెపై కోపం పెంచుకున్న భర్త.. ఆమె కోసం దారిలో కాపుకాసి తుపాకీతో విచక్షణా రహితంగా కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో చోటుచేసుకుంది. రూప్ సింగ్ స్టేడియం సమీపంలో కాంట్రాక్టర్ అరవింద్ పరిహార్ .. తన భార్య నందినిని అడ్డగించి ఒక తుపాకీతో ఆమెపై నాలుగైదు రౌండ్ల కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడే కుప్పకూలిపోగా.. అరవింద్ పరిహార్ ఆ పక్కనే కూర్చున్నాడు. స్థానికులు అతని చేతిలో ఉన్న తుపాకీకి భయపడి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయలేక చూస్తుండిపోయారు. ఇంతలో పోలీసులకు సమాచారమివ్వగా.. వారు అక్కడికి చేరుకుని అరవింద్ పై టియర్ గ్యాస్ ప్రయోగించి పట్టుకున్నారు. నందినిని జేఏహెచ్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్పీ యాదవ్ తెలిపారు.
కాగా.. అరవింద్, నందినిలది ప్రేమ వివాహం అని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే అరవింద్ కు పెళ్లై పిల్లలున్నారన్న విషయాన్ని తనకు చెప్పకుండా మోసం చేశాడంటూ నందిని సెప్టెంబర్ 9న ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసింది. గతేడాది నవంబర్ లో అతను, అతని ఫ్రెండ్ పూజా పరిహార్ తనపై దాడి చేశారని కూడా కంప్లైంట్ చేసింది. కాగా.. నందినికి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మూడవ భర్త హత్యకేసులో 2022లో జైలు నుంచి విడుదలై బయటికి వచ్చినట్లు సమాచారం.
Read More : భార్య – భర్తలు అంటే ఇలా ఉండాలి.. చెరో బీర్ చేతిలో పట్టుకొని చిల్ అవుతూ






