భర్తకు లివర్‌ దానం చేసిన భార్య.. చికిత్స అనంతరం ఇద్దరు మృతి

by Malleboina Mahesh |   (  Updated:2025-08-25 13:49:57  IST  )

భర్త లివర్ చెడిపోవడంతో.. భార్య తన లివర్ లో కొంత భాగాన్ని భర్తకు దానం చేసింది. అయితే ఈ సర్జరీ పూర్తి అయిన తర్వాత కొన్ని రోజులకే భార్య, భర్త ఇద్దరు మృతి చెందారు.

భర్తకు లివర్‌ దానం చేసిన భార్య.. చికిత్స అనంతరం ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: భర్త లివర్ చెడిపోవడంతో.. భార్య తన లివర్‌లో కొంత భాగాన్ని భర్తకు దానం చేసింది. అయితే ఈ సర్జరీ పూర్తి అయిన తర్వాత కొన్ని రోజులకే భార్య, భర్త ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన మహారాష్ట్రలోని పుణేలో చోటు చేసుకుంది. అయితే భార్య, భర్తలు ఇద్దరు మరణించడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. దీంతో దంపతులు మృతిపై స్పందించిన మహారాష్ట్ర ఆరోగ్య శాఖ.. వారికి సర్జరీ చేసిన ప్రైవేట్ ఆస్పత్రికి నోటీసులు జారీ చేసింది. ఈ లివర్ మార్పిడి ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలు సమర్పించాలని సహ్యాద్రి ఆసుపత్రిని ఆదేశించినట్లు ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె మీడియాకు తెలిపారు. అయితే మృతి చెందిన దంపతులు కుటుంబ సభ్యులు మాత్రం ఆస్పత్రి సిబ్బంది, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందినట్లు ఆరోపిస్తున్నారు. అలాగే మృతుల కుటుంబ సభ్యలును ప్రభుత్వం ఆదుకోవాలని, ఇద్దరి మృతికి కారణం అయిన ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

Read More..

వివాహిత మహిళ అదృశ్యం..

Next Story