వివాహిత మహిళ అదృశ్యం..

by I. Sairam |   (  Updated:2025-08-25 13:52:06  IST  )

మండల పరిధిలోని చందాపూర్ గ్రామంలో ఓ మహిళ అదృశ్యం అయిందని స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు.

వివాహిత మహిళ అదృశ్యం..
X

దిశ, చిన్నశంకరంపేట: మండల పరిధిలోని చందాపూర్ గ్రామంలో ఓ మహిళ అదృశ్యం అయిందని స్థానిక ఎస్సై నారాయణ గౌడ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మనలాబాద్ మండలం పరికిబండ గ్రామానికి చెందిన చింతల కవిత (45) ఈనెల 21న చందాపూర్ గ్రామంలో ఉన్న తన చెల్లెలి ఇంటికి వచ్చిందని తెలిపారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికిన ఆమె ఆచూకీ లభించడం లేదని దీంతో కవిత అన్న గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు. ఆచూకీ తెలిసినవారు 8712657937 నెంబరుకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు.

Read More..

suicide : సారీ నాన్న అంటూ .. యువతి సూసైడ్ నోట్

Next Story