డేటింగ్ వెబ్‌సైట్ పేరుతో ఫిమేల్ ఎస్కార్ట్ సేవలంటూ భారీ మోసం

by Gantepaka Srikanth |   (  Updated:2025-01-31 15:54:37  IST  )

డేటింగ్ వెబ్ సైట్ పేరుతో ఫిమేల్ ఎస్కార్ట్ సేవలంటూ మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐడీ డీజీ శిఖా గోయల్ తెలిపారు.

డేటింగ్ వెబ్‌సైట్ పేరుతో ఫిమేల్ ఎస్కార్ట్ సేవలంటూ భారీ మోసం
X

దిశ, తెలంగాణ బ్యూరో: డేటింగ్ వెబ్ సైట్ పేరుతో ఫిమేల్ ఎస్కార్ట్ సేవలంటూ మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐడీ డీజీ శిఖా గోయల్ తెలిపారు. రాజస్థాన్‌కు చెందిన పాటిదార్ నరేష్ డేటింగ్ వెబ్‌సైట్ www.in.sduko.comలో మోసపూరతమైన చర్యలు చేపడుతున్నట్లు ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను శుక్రవారం పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో నిందితుడు నరేష్ లైంగిక ప్రయోజనాల కోసం 16 ఏళ్ల మైనర్ బాలికను ఎస్కార్ట్ సేవలకు అందిస్తానని బాధితులను మోసం చేశాడని తెలిపారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు సమయంలో దేశ వ్యాప్తంగా 16 కేసులు నమోదైనట్లు గుర్తించినట్లు చెప్పారు.

సేకరించిన సాంకేతిక ఆధారాల ఆధారంగా విచారణ అధికారి అశోక్ కుమార్, డీఎస్పీ, సైబర్ క్రైమ్స్, సీఐడీ, టీజీ, హైదరాబాద్ తన బృందంతో పాటు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ప్రసాద్, సయ్యద్ తాహెర్, యాదిరెడ్డి నిందితుడు నరేష్ పాటిదార్‌ను రాజస్థాన్లో పట్టుకున్నారని తెలిపారు. ట్రాన్సిట్ వారెంట్ పొందడం కోసం రాజస్థాన్ రాష్ట్రం అస్పూర్‌లోని స్థానిక కోర్టులలో హాజరుపరిచినట్లు తెలిపారు. ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్సన్), ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.


Read Also..

పేరుకే యాంకర్.. హీరోయిన్‌కు ఏమాత్రం తీసుపోదంటున్న నెటిజన్స్..

Next Story