రెండు ఎన్కౌంటర్లు.. ఐదుగురు మావోయిస్టులు మృతి

by Batti.Sumithra |   (  Updated:2025-12-25 07:45:02  IST  )

రెండు వేరు వేరు ఎన్ కౌంటర్ లలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు.

రెండు ఎన్కౌంటర్లు.. ఐదుగురు మావోయిస్టులు మృతి
X

దిశ, భద్రాచలం : రెండు వేరు వేరు ఎన్ కౌంటర్ లలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. బుధవారం అర్ధరాత్రి గుమ్మా అటవీ ప్రాంతంలో ఒడిస్సాకు చెందిన ప్రత్యేక బలగాల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందినవారిని ఏసీఎం బారి, బీపీఎం అమరిత్ గా గుర్తించారు. వీరు సివిల్ డ్రెస్ లో ఉండి మావోయిస్టులకు అవసరం అయ్యే వస్తువులు సరఫరా చేసే టీమ్ గా గుర్తించారు.

వీరి వద్ద నుండి ఒక రివాల్వర్, ఒక 303 రైఫిల్, వాకీ టాకి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై రు. 23.65 లక్షల రివార్డ్ ఉన్నట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. గురువారం ఒడిస్సాలోని కందమాల్ లో జరిగిన మరో ఎన్కౌంటర్ లో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. సంఘటనా స్థలం నుండి రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఒక 303 రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు ఒడిస్సా పోలీస్ డీఐజీ ఆపరేషన్స్ అఖిలేశ్వర్ సింగ్ తెలిపారు.

Read More..

గుమ్మా అటవీ ప్రాంతంలో భీకర్ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు మృతి

Next Story