- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఘోర రోడ్డుప్రమాదం.. కుటుంబం మృతి
తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినవారు మరణించారు.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులోని మధురై సమీపంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినవారు మరణించారు. దైవ దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకోంది. ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురైలోని అన్నానగర్ కు చెందిన ప్రకాష్.. అతని బంధువు రమేష్ తో పాటు మరో ముగ్గురు మహిళలు తిరుచిరాపల్లిలోని ప్రముఖ సమయపురం మరియమ్మన్ ఆలయానికి వెళ్లారు. ఆదివారం సాయంత్రం దైవదర్శనం ముగించుకుని తిరిగి మధురైకి బయల్దేరారు. మేలూరు సమీపంలోని అయ్యపట్టి వద్ద హైవేపై వీరి కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న బ్యారియర్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది. ఆ సమయంలో కారులో ఉన్న ఐదుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కొట్టంపట్టి పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మేలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తుతో ఉండటం లేదా.. వెహికల్ లో టెక్నికల్ ఇషఅయూ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో.. బంధువుల రోదనలు మిన్నంటాయి.






