- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-వ్యాన్ ఢీకొని ఎనిమిది మంది దుర్మరణం
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ ఖేరి జాతీయ రహదారిపై వ్యాన్, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది

దిశ, వెబ్ డెస్క్: జాతీయ రహదారిపై ట్రక్కు-వ్యాన్ ఎదురెదురుగా ఢీకొని 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లఖింపూర్ నుండి ఇసానగర్ (సిసైయా) వైపు సుమారు 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న మ్యాజిక్ వ్యాన్.. ఊంచ్ గావ్, భరేహతా గ్రామాల మధ్య వేగంగా వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు వ్యాన్ నుజ్జు నుజ్జు అయింది. ఈ భయంకర ప్రమాదంలో ఎనిమిది మంది (8) ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం.
అలాగే ఘోర ప్రమాదంలో మరో ఇద్దరు ప్రయాణికులు అత్యంత క్లిష్టమైన (Critically Injured) స్థితిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తుంది. స్థానికులు, పోలీసులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఖమారియా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు, అనంతరం మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దౌరహ్రా సర్కిల్ ఆఫీసర్ (CO) శంషేర్ బహదూర్ సింగ్ నేతృత్వంలో పోలీసులు క్రాష్ అయిన వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించి రద్దీని క్రమబద్ధీకరించారు. మృతుల వివరాలను సేకరిస్తున్నామని, ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు మీడియాకు తెలిపారు.






