ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. రైతు మృతి

by Jakkula.Mamatha |

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రాజీవ్ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. రైతు మృతి
X

దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ రాజీవ్ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన వివరాలు స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కరీంనగర్ వైపు నుంచి గన్నేరువరం వెళ్తున్న ట్రాక్టర్‌ని నుస్తులాపూర్ శివారులోకి రాగానే వెనక నుంచి డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన రైతు కాంతాల రాజిరెడ్డి(58)కి తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story