Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం, మరో 50 మంది సేఫ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-14 07:44:39  IST  )

భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన గుజరాత్ (Gujrat) రాష్ట్రంలో చోటుచేసుకుంది.

Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం, మరో 50 మంది సేఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) సంభవించిన ఘటన గుజరాత్ (Gujrat) రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్ (Rajkot) పట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్టుండి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఓ ఫ్లాట్‌లో మంటలు చెలరేగగా.. మెల్లిగా ఆ మంటలు కాస్త అపార్ట్‌మెంట్ మొత్తం వ్యాప్తించారు. దీంతో ఆయా ఫ్లాట్‌లలో నివాసం ఉంటున్న వారంతా తట్టా.. బుట్ట వదిలేసి ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు కాలి బూడిదై ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. అదేవిధంగా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. ఫైర్ సిబ్బంది మరో 50 మందిని సురక్షితంగా అపార్ట్‌మెంట్ నుంచి బయటకు తీసుకొచ్చారు.

Read More..

అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన ట్రక్కు.. పండుగ పూట తప్పిన పెను ప్రమాదం

Next Story