- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ప్రపంచం కోసం భారత్ నుంచే పనిచేస్తాం’.. ప్రధాని మోడీకి హైదరాబాద్ స్కైరూట్ ఏరోస్పేస్ కృతజ్ఞతలు
దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగంతో చరిత్ర సృష్టించిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ బృందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగంతో చరిత్ర సృష్టించిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’ (Skyroot Aerospace) బృందాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభంలో మీడియా ప్రకటనలో మాట్లాడిన ప్రధాని.. ఈ స్పేస్ స్టార్టప్‌లో పనిచేస్తున్న ఇంజనీర్ల సగటు వయస్సు కేవలం 28 ఏళ్లేనని కొనియాడారు. దేశ యువతలో ఉన్న ప్రతిభకు, అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలకు ఈ విజయం ఒక మైలురాయి అని ప్రశంసించారు. ప్రధాని ఫోన్ ద్వారా కూడా విక్రమ్-1 బృందానికి అభినందనలు తెలిపి, తమను కలవాల్సిందిగా ఆహ్వానించారు.
ప్రధాని ప్రశంసలపై హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ప్రధానికి ధన్యవాదాలు తెలిపింది. ‘పార్లమెంట్ వేదికగా ప్రధాని మోడీ తమ బృందాన్ని అభినందించడం ఎంతో గర్వకారణం. తమ బృందం సగటు వయసు 28 ఏళ్లని ఆయన ప్రస్తావించడం యువ ఇంజనీర్లకు గొప్ప ప్రోత్సాహం. ఆశయాలకు తగిన అవకాశాలు లభిస్తే భారతీయ యువత ఎంతటి అద్భుతాలైనా సాధించగలరని ఇది నిరూపించింది. ప్రపంచం కోసం భారత్ నుంచే స్పేస్ టెక్నాలజీని నిర్మిస్తాం’.’ అని స్కైరూట్ ఏరోస్పేస్ పేర్కొంది.






