అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన ట్రక్కు.. పండుగ పూట తప్పిన పెను ప్రమాదం

by Malleboina Mahesh |   (  Updated:2025-03-15 13:38:31  IST  )

మహారాష్ట్రలో పండగపూట పెను ప్రమాదం తప్పింది. పట్టాలపై వెళ్తున్న రైలును ఓ ట్రక్కు ఢీకొట్టన ఘటన మహారాష్ట్రలోని భూసావల్ డివిజన్‌లో చోటు చేసుకుంది.

అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రైలును ఢీకొట్టిన ట్రక్కు.. పండుగ పూట తప్పిన పెను ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో పండగపూట పెను ప్రమాదం తప్పింది. పట్టాలపై వెళ్తున్న రైలును ఓ ట్రక్కు ఢీకొట్టన ఘటన మహారాష్ట్రలోని భూసావల్ డివిజన్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భూసావల్ డివిజన్‌లోని భూసావల్, బద్నేరా సెక్షన్ల మధ్య బోద్వాడ్ రైల్వే స్టేషన్ (Bodwad Railway Station) వద్ద ముంబై-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ (Mumbai-Amravati Express)ను ట్రక్కు ఢీకొట్టింది. రోడ్డు మీదనుంచి వేగంగా వచ్చిన ట్రక్కు(Truck) మూసివేసిన రైల్వే క్రాసింగ్‌ (Railway crossing)ను దాటివేసి.. రైలింజన్ ముందు బాగంలో ఢీకొట్టింది (truck crashed into the front of a railway locomotive.). దీంతో వేగంగా వెళ్తున్న ట్రైన్ కి ట్రక్కు ఇంజన్ భాగం అడ్డుపడగా రైలు పట్టాలపై ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ లేదా ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని రైల్వే పోలీసులు (Railway Police) స్పష్టం చేశారు. అయితే రైల్వే గేటు వద్ద ట్రక్కు ఆగకపోవడమే ఈ ప్రమాదానికి కారణం అని తెలిపారు. ఈ యాక్సిడెంట్ సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అధికారులు (Railway Police and Officers) వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ట్రక్కును పట్టాలపై నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదం కారణంగా ఆ రూట్ లో నడిచే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం నెలకొంది. ఈ ఘటనపై రైల్వే అధికారులు (Railway officials) స్పందిస్తూ.. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.. కొద్ది గంటల్లోనే ట్రాక్ క్లియర్ చేస్తామని తెలిపారు. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story