- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమజంటను కట్టేసి నిప్పంటించిన కుటుంబసభ్యులు.. అయినా కోపం చల్లారకపోవడంతో..
ప్రేమజంటను కట్టేసి నిప్పంటించిన కుటుంబసభ్యులు.. అయినా కోపం చల్లారకపోవడంతో..

దిశ, వెబ్‌డెస్క్: రాజస్తాన్ రాజధాని జైపూర్(Jaipur)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. భరోలావ్ గ్రామంలో ఓ యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని ఇద్దరూ ఇంట్లో చెప్పారు. అయితే.. యువతి ఫ్యామిలీలో నిరాకరించారు. యువతిని మందలించారు. అయినా వారి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగడంతో ఇద్దరినీ ఒక చోటుకు పిలిపించుకుని విచక్షణారహితంగా దాడి చేశారు. అయినా కూడా వారి కోపం చల్లారకపోవడంతో చెట్టుకు కట్టేసి ఇద్దరికీ నిప్పంటించారు. మంటల్లో కాలి తీవ్ర గాయాలైన వారిని స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన గ్రామానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం యువకుడు 60 శాతం, యువతికి 30 శాతం కాలిన గాయాలు అయ్యాయి. విషయం ఏదైనా పేరెంట్స్ ఇంత మూర్ఖంగా వ్యవహరించడం దారుణమని గ్రామస్తులు మండిపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మౌనిక పేరుతో మెసేజ్.. రిప్లై ఇచ్చిన డాక్టర్ ఊహించని షాక్
సెక్స్ గేమ్.. కారు ‘కీ’ ఎవరికి దక్కుతుందో వారికి రాత్రంతా భార్యను ఇచ్చేయాల్సిందే.. రిచ్ ఫ్యామిలీస్‌లో డర్టీ కల్చర్






