మౌనిక పేరుతో మెసేజ్.. రిప్లై ఇచ్చిన డాక్టర్‌కు ఊహించని షాక్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-11-29 11:15:44  IST  )

సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర అమాయకులు మోసాల బారిన పడుతూనే ఉన్నారు. చదువుకోని వారు సైబర్ నేరాలకు గురవుతున్నారు అనుకుంటే పొరపాటే..

మౌనిక పేరుతో మెసేజ్.. రిప్లై ఇచ్చిన డాక్టర్‌కు ఊహించని షాక్
X

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర అమాయకులు మోసాల బారిన పడుతూనే ఉన్నారు. చదువుకోని వారు సైబర్ నేరాలకు గురవుతున్నారు అనుకుంటే పొరపాటే.. ఎంతోచదువుకుని ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నవారు సైతం మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హబ్సిగూడకు చెందిన డెంటల్ డాక్టర్ ఒకరు ఏకంగా రూ.14 కోట్లు పోగొట్టుకున్నారు. ఫేస్ బుక్ లో మౌనిక అనే ఖాతా నుండి మెసేజ్ రావడంతో డాక్టర్ ఓపెన్ చేశాడు.

అమ్మాయి మెసేజ్ చేసిందని మురిసిపోయాడో ఏమో గానీ వెంటనే రిప్లై ఇచ్చాడు. అలా ఇద్దిర మధ్య పరిచయం ఏర్పడి కొద్దిరోజులు చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో తనకు కష్టాలు ఉన్నాయని ఆదుకోవాలని ఫేక్ మౌనిక నుండి మెసేజ్ వచ్చింది. ఆమె మాయలో పడిపోయిన డాక్టర్ విడతల వారిగా అడిగినంత డబ్బులు ఇచ్చేశాడు. డబ్బు మొత్తం పోగొట్టుకున్న తరవాత అది సైబర్ నేరగాళ్ల పన్నాగం అని అర్థం కావడంతో డాక్టర్ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ప్రేమజంటను కట్టేసి నిప్పంటించిన కుటుంబసభ్యులు.. అయినా కోపం చల్లారకపోవడంతో.

Next Story