నటికి లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-25 15:55:03  IST  )

నటిని వేధించడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. మలయాళ నటి రిని ఆన్ జార్జ్ పై వేధింపులకు పాల్పడటంతో ఎమ్మెల్యే రాహుల్ ముమూటతిల్ పై బీజేపీ ఆందోళనలను తీవ్రతరం చేసింది.

నటికి లైంగిక వేధింపులు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు
X

దిశ‌, వెబ్ డెస్క్: నటిని వేధించడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది. మలయాళ నటి రిని ఆన్ జార్జ్ పై వేధింపులకు పాల్పడటంతో ఎమ్మెల్యే రాహుల్ ముమూటతిల్ పై బీజేపీ ఆందోళనలను తీవ్రతరం చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఆయన ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసి పార్టీ నుండి సస్పెండ్ చేసింది. అయితే అంతకుముందే రాహుల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సైతం రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని మాత్రం కాంగ్రెస్ ఆదేశించలేదు. ఇదిలా ఉంటే వారం రోజుల క్రితం నటి రిని ఆన్ జార్జ్.. ఓ ప్రధాన పార్టీకి చెందిన యువ నాయకుడు తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, అభ్యంతకర సందేశాలు పంపుతూ హోటల్ కు రావాలని వేధిస్తున్నాడని ఆరోపణలు చేసింది.

ఆమె పేరు చెప్పనప్పటికీ బీజేపీ నేతలు, సీపీఎం నేతలు రాహుల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు రచయిత్రి హనీ భాస్కరన్ బహిరంగంగా తనను సైతం వేధిస్తున్నాడని, నిరంతరం సందేశాలు పంపిస్తున్నాడని ఆరోపించింది. యూత్ కాంగ్రెస్ లో అతనిపై అనేక ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోలేదని పేర్కొంది. కాగా ఇదే వివాదంలో ఓ ట్రాన్స్ జెండర్ సైతం రాహుల్ పై ఆరోపణలు చేసింది. ఇలా చాలా మంది మహిళలను వేధించినట్టు ఆరోపణలు రావడంతో పార్టీ అతడిపై చర్యలు తీసుకుంది. మహిళా కమిషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి విచారిస్తోంది.

Read More : అసలు మ్యాటర్ నా కాళ్ల మధ్యే ఉంది.. హీరోయిన్‌తో ముసలి రాజకీయ నాయకుడు మత్తెక్కించే సెక్స్ సంభాషణ.. ఆడియో రికార్డులు లీక్

ప్రియురాలి నోట్లో బాంబులు పెట్టి పేల్చేసిన ప్రియుడు.. ఇంత క్రూరంగా మారడానికి కారణం ఏంటంటే?

Next Story