మూడేళ్లుగా ప్రేమ.. ప్రియురాలు చీర, వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసి ప్రియుడు ఆత్మహత్య

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-09 07:26:33  IST  )

ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ప్రియుడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరుకు చెందిన కిరణ్ (26) అనే జిమ్ ట్రైనర్ మూడేళ్లుగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు.

మూడేళ్లుగా ప్రేమ.. ప్రియురాలు చీర, వెడ్డింగ్ ఇన్విటేషన్ చూసి ప్రియుడు ఆత్మహత్య
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో ప్రియుడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బెంగళూరుకు చెందిన కిరణ్ (26) అనే జిమ్ ట్రైనర్ మూడేళ్లుగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. మూడేళ్ల వ‌ర‌కు వీరి ప్రేమ ప్ర‌యాణం సాఫీగానే సాగ‌గా తాజాగా త‌న వివాహం నిశ్చ‌య‌మైంద‌ని యువ‌తి ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చింది. అంతేకాకుండా వెడ్డింగ్ కార్డ్ తో పాటు పెళ్లి కోసం కొనుగోలు చేసిన కొత్త చీర‌ను సైతం చూపించింది. పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల‌ని కోరినా లాభం లేక‌పోవ‌డంతో ప్రియురాలిని కోల్పోతున్నా అనే బాధ‌ను త‌ట్టుకోలేక‌పోయాడు.

యువ‌తితో మాట్లాడి ఇంటికి వ‌చ్చిన త‌ర‌వాత పూర్తిగా డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయాడు. ఈ క్ర‌మంలో అతడు గ‌దిలోకి వెళ్లి తిరిగి బ‌య‌ట‌కు రాలేదు. దీంతో అనుమానం వ‌చ్చిన కుటుంబ స‌భ్యులు త‌లుపులు బద్ద‌లు ఒట్ట‌గా ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించాడు. పోస్ట్ మార్టం నిమ్మితం అత‌డిని విక్టోరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్రియురాలు మోసం చేయ‌డం వ‌ల్ల‌నే కిర‌ణ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఆమె కుటుంబం కోసం రూ.50 లోన్ తీసుకున్నాడ‌ని, మాన‌సింగా వేధించ‌డ‌మే కాకుండా ఆర్థికంగా దోచుకున్నార‌ని తెలిపారు. త‌మ కుమారుడి చావుకు కార‌ణమైన యువ‌తిని క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.

ఛీ.. కూతురివేనా?.. కన్న తల్లి నగ్నఫోటోలు లవర్‍కు పంపిన కూతురు

Next Story