- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛీ.. కూతురివేనా?.. కన్న తల్లి నగ్నఫోటోలు లవర్‍కు పంపిన కూతురు
తల్లి ప్రైవేట్ వీడియోలు రహస్యంగా చిత్రీకరించి వాటిని ప్రియుడికి పంపుతున్న కూతురు బాగోతం భట్టబయలైంది

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అచ్చం అలాంటి ఘటనే బెంగళూరులో ఓ కుటుంబానికి పీడకలగా మారింది. కన్న తల్లి ప్రైవేట్ ఫోటోలు తన ప్రియుడికి రహస్యంగా పంపుతూ అడ్డంగా దొరికిపోయింది ఓ కూతురు. కూతురు ప్రవర్తనకు కంగుతిన్న ఆ తల్లి చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించింది. బెంగళూరులో జరిగిన ఈ షాకింగ్ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. 25 సంవత్సరాలుగా బెంగళూరులో నివసిస్తున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు (23) బీబీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేయగా చిన్న కూతురు ఇంకా చదువుతోంది. తండ్రి వంటమనిషిగా పని చేస్తూ కూటుంబాన్ని పోషిస్తుండగా తల్లి గృహిణిగా ఉంది. అయితే తన చదువుకు అవసరం అని చెప్పి పెద్ద కుమార్తె పేరెంట్స్ చేత ఓ సెల్ ఫోన్ కొనిపించుకుంది. నెల రోజుల క్రితం క్రమంగా ఆమె ప్రవర్తనలో తేడాను తల్లిదండ్రులు గమనించారు. ఆమె తెలియని వ్యక్తితో మాట్లాడుతున్నట్లు కనుగొన్నారు. ఓ రోజు ఇంటి పని చేసుకుంటున్న తల్లి తన కుమార్తె గదిలోకి ప్రవేశించినప్పుడు ఆమె వేరే వ్యక్తితో వీడియో కాల్‍లో మాట్లాడుతున్నట్లు తల్లి గుర్తించి ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇస్తూ తప్పించుకుంది.
తల్లితో పాటు మరో మహిళ వీడియోలు:
కుతురు ప్రవర్తన పట్ల ఆందోళన వ్యక్తం చేసిన తల్లిదండ్రులు తమ దగ్గరి బంధువులను పిలిపించి ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ ఆ యువతి మాత్రం తాను ఫోన్‍లో ఎవరితో మాట్లాడుతున్నదో ఆ వివరాలేవి వారితో పంచుకోలేదు. పైగా ఫోన్ పాస్ వర్డ్ ను సైతం చెప్పడానికి మొండికేసింది. చాలా గంటల తర్వాత ఆమెను ఒప్పించిన తర్వాత కుటుంబ సభ్యులు ఆమె ఫోన్‍ను యాక్సెస్ చేయగలిగారు. ఆ ఫోన్ అన్ లాక్ చేసి చూడగా అందులో ఉన్న కంటెంట్ చూసి వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. అందులో ఆ యువతి తల్లితో పాటు తల్లి సోదరి నగ్న చిత్రాలు, వీడియోలు గుర్తించారు. వారు ఇంట్లో స్నానం చేస్తుండగా రహస్యంగా చిత్రీకరించి తన ప్రియుడికి పంపించింది.
అతడి వెనకాల ఉన్నదెవరు?
వెంటనే కూతురు చేసిన పనికి కంగారుపడిన సదరు తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమార్తెతో పాటు ఆమె ప్రియుడి ఫోన్‌లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపించారు. అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నామని, ఫోరెన్సిక్ నివేదికలు అందిన తర్వాత వాస్తవాలు మరింత స్పష్టంగా తెలుస్తాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. తమ ప్రైవేట్ ఫోటోలు తమ కూతురి ద్వారానే సేకరించిన యువకుడు వాటిని ఇతరులకు పంపించాడా? అసలు ఇదంతా అతడే చేయించాడా లేక అతడి వెనుక ఎవరైనా ఉన్నారా అనే ఆందోళన ఆ కుటుంబ సభ్యులను వెంటాడుతోంది. కాగా పిల్లల ప్రవర్తనను ఓ కంట కనిపెడుతూ ఉండాలనడానికి ఈ ఘటన ఓ ఉదాహారణగా నిలుస్తోంది.






