- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాత్రూమ్ వీడియోలతో బ్లాక్మెయిల్.. నటి అమూల్య శ్రీ బలవన్మరణం
కామాంధుల వేధింపులు భరించలేక ఓ షార్ట్ ఫిల్మ్ నటి బలవన్మరణానికి పాల్పడిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది.

దిశ, వెబ్డెస్క్: సినిమాల్లో నటించాలని ఎన్నో ఆశలతో హైదరాబాద్ నగరానికి వచ్చిన ఓ యువతి చివరకు శవమై తేలింది. సైదాబాద్ పరిధిలో నివాసముంటున్న షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ కామాంధుల బ్లాక్మెయిలింగ్ తట్టుకోలేక మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా నిందితులపై సరైన చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. కుటుంబ సభ్యుల కథనం మేరకు కొంతమంది యువకులు అమూల్య శ్రీకి సంబంధించిన కొన్ని వ్యక్తిగత బాత్రూమ్ వీడియోలను రహస్యంగా రికార్డ్ చేశారు. ఆ వీడియోలను చూపించి గత 6 నెలలుగా ఆమెను తీవ్ర నరకయాతనకు గురిచేశారు. తమ కోరిక తీర్చడానికి తమ దగ్గరికి రావాలని, లేదంటే ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి కెరీర్ నాశనం చేస్తామంటూ నిందితులు అమూల్య శ్రీని బ్లాక్మెయిల్ చేశారు.
పోలీసులను ఆశ్రయించినా ఫలితం శూన్యం..
అయితే, వేధింపుల నుంచి తనను కాపాడి న్యాయం చేయాలంటూ అమూల్య శ్రీ ఆత్మహత్యకు ముందే పోలీసులను ఆశ్రయించినట్లుగా తెలుస్తోంది. అయితే, బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు సకాలంలో స్పందించలేదని, నిందితులపై తగిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమూల్య, 10 రోజుల క్రితమే తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అమూల్యకు తండ్రి కూడ లేకపోవడంతో ఆమె తల్లి ఒంటరిగా న్యాయం కోసం పోరాడుతూ.. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.






