- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోతె మండలంలో అర్ధరాత్రి ఈదురుగాలుల బీభత్సం
సూర్యాపేట జిల్లా మోతె మండలంలో గురువారం రాత్రి వీచిన బలమైన గాలి దుమారం బీభత్సం సృష్టించింది.

దిశ మోతె: సూర్యాపేట జిల్లా మోతె మండలంలో గురువారం రాత్రి వీచిన బలమైన గాలి దుమారం బీభత్సం సృష్టించింది. రాఘవాపురం ఎక్స్‌రోడ్ గ్రామంలో గాలుల తీవ్రతకు పలు ఆస్తులు దెబ్బతిన్నాయి. గ్రామానికి చెందిన కోల రవి కిరాణా దుకాణం దెబ్బతినగా, కారింగుల లింగమూర్తి ట్రాక్టర్ మెకానిక్ షెడ్ ధ్వంసమైంది. అలాగే వీరన్న నివాస గృహం పై కప్పు దెబ్బతిని ఆస్తి నష్టం వాటిల్లింది. బలమైన ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు విరిగి రహదారులపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
విద్యుత్ తీగలపై చెట్లు పడటంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకస్మాత్తుగా సంభవించిన ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది, స్థానికులు చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. నష్టం జరిగిన ప్రాంతాలను అధికారులు పరిశీలించి బాధితులకు తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.






