- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసు.. పోలీసు కస్టడీలోకి నిందితులు
న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో నిందితుల విచారణ మొదలైంది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో పట్టపగలు కలకలం రేపిన న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ (Khaja Mohiuddin) హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోని ప్రధాన నిందితులను నాంపల్లి పోలీసులు ఇవాళ ఉదయం తమ కస్టడీలోకి తీసుకున్నారు. హత్యకు గల పూర్తి కారణాలు, అందుకు ప్రోత్సహించిన వారి హస్తం ఎవరిదనే కోణంలో పోలీసులు వీరిని లోతుగా విచారించనున్నారు. అయితే, ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న నిందితులు ఆలంఖాన్, ముజాహిద్‌లను పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి తమ కస్టడీకి తీసుకున్నారు. అంతకుముందు, కేసు దర్యాప్తు నిమిత్తం నిందితులను తమకు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. పోలీసుల విజ్ఞప్తిని పరిశీలించిన నాంపల్లి కోర్టు నిందితులు ఇద్దరినీ 2 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ అనుమతి ఇచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం.. నాంపల్లి పోలీసులు నిందితులు ఆలం ఖాన్, ముజాహిద్‌లను రహస్య ప్రాంతంలో విచారించే అవకాశం ఉంది.






