- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీసీఎం వ్యాన్ బీభత్సం.. 20 మేకలు మృతి, వ్యక్తికి తీవ్ర గాయాలు
కామారెడ్డి జిల్లా లింగంపేట ఎల్లారెడ్డి మండలాల సరిహద్దు గ్రామమైన కొట్టాల్ గ్రామ స్టేజి వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో 20 మేకలు మృతి చెందగా మేకల కాపరి ఆలకుంట శివయ్య తీవ్రంగా గాయపడ్డాడు.

దిశ, లింగంపేట: కామారెడ్డి జిల్లా లింగంపేట ఎల్లారెడ్డి మండలాల సరిహద్దు గ్రామమైన కొట్టాల్ గ్రామ స్టేజి వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో 20 మేకలు మృతి చెందగా మేకల కాపరి ఆలకుంట శివయ్య తీవ్రంగా గాయపడ్డాడు. కొట్టాల గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆలకుంట శివయ్య బోదాస్ గంగారాం, కిషన్ అనే వ్యక్తులు తమ మేకలను కొట్టంలో నుంచి వదులుకొని మేత కోసం అడవిలోకి పోతుండగా కామారెడ్డి వైపు నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న డీసీఎం వ్యాన్ అతివేగంగా వచ్చి మేకలను మేకల కాపరిని ఢీకొట్టినట్లు వారు చెప్పారు.
ఈ ప్రమాదంలో ఆలకుంట శివయ్యకు చెందిన 13 మేకలు బోదాస్ గంగారాం కు చెందిన రెండు మేకలు కిషన్ అనే రైతుకు చెందిన ఐదు మేకలు నుజ్జు నుజ్జైనట్లు వారు తెలిపారు. డీసీఎం వ్యాన్ తాకిడికి మేకల కాపరి ఆలకుంట శివయ్య తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు వారు చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ శివయ్యను 108 అంబులెన్స్ లో వైద్య చికిత్సల నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఎల్లారెడ్డి పోలీసులు ప్రమాద ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.






