- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోట్ల కోసం భర్తను వదిలేసి.. ప్రియుడి కోసం కూతురును చంపేసి.. చివరికి ఊహించని ట్విస్ట్
బెంగుళూరులో ప్రియుడి కోసం తల్లి కూతురిని హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరులో ఉండే ప్రియాంకకు 15ఏళ్ల క్రితం ప్రవీణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: బెంగుళూరులో ప్రియుడి కోసం తల్లి కూతురిని హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగుళూరులో ఉండే ప్రియాంకకు 15ఏళ్ల క్రితం ప్రవీణ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి 11ఏళ్ల కుమారుడు, 5ఏళ్ల కుమార్తె వెన్నెల ఉన్నారు. ప్రియాంక న్యాయవాధిగా పనిచేస్తుండగా ఆమె భర్త ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. వీరి సంసారం సాఫీగా సాగుతున్న సమయంలో ప్రియాంకకు తన పాఠశాల మిత్రుడు మోహన్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. విషయం భర్త ప్రవీణ్ కుత తెలియడంతో ఆమెను మందలించాడు. దీంతో ప్రియాంక కూతురిని తీసుకుని మోహన్ వద్దకు వెళ్లిపోయి అతడితో కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
అంతే కాకుండా తన భర్తకు విడాకుల నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఓ రోజు భర్తకు ఫోన్ చేసి కూతురు అనారోగ్యంతో మరణించిందని చెప్పి అంత్యక్రియలు పూర్తి చేసింది. చిన్నారి పోస్ట్ మార్టం రిపోర్డ్ భర్త కోరడంతో అతడికి పంపించింది. దానిని ప్రవీణ్ స్నేహితుడు అయిన డాక్టర్ కు పంపించడంతో పోస్ట్ మార్టం రిపోర్ట్ సరిగ్గా లేదని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ప్రవీణ్ తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమ స్టైల్ లో విచారణ జరపగా దర్యాప్తులో సంచలన విషయాలు భయపడ్డాయి.
తల్లి ప్రియాంకనే కూతురును గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది. మోహన్ తో జీవించడానికి అడ్డుగా ఉందనే కూతురును హత్య చేసినట్టు విచారణలో తెలిసింది. ఈ కేసులో మోహన్ ను పోలీసులు ముందుగానే అరెస్ట్ చేయగా ప్రియాంక తప్పించుకుని పారిపోయింది. కాగా ఆమెను పోలీసులు గురువారం అరెస్ట్ చేసి బెంగుళూరుకు తీసుకువచ్చారు. ఈ కేసులో మరికొన్ని షాకింగ్ నిజాలను పోలీసులు వెల్లడించారు. ప్రియుడు మోహన్ తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, వేల కోట్ల అధిపతిని అని ప్రియాంకను మోసం చేసినట్టు గుర్తించారు. ఆ తరవాత ప్రియాంకకు అసలు నిజం తెలిసినప్పటికీ అప్పటికే ఇంటి నుండి వచ్చేసింది కాబట్టి అతడితోనే సర్దుకుపోయిందని విచారణలో తేలింది. ఇక ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని చిన్నారి తండ్రి ప్రవీణ్ డిమాండ్ చేస్తున్నాడు.






