సినిమా రిలీజ్‌ ముందు హడావిడి అందుకే.. ఇండస్ట్రీ టాప్ సీక్రెట్ బయటపెట్టిన నందిని రెడ్డి

by Pulgam srinivas |

రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాతే టెక్నీషియన్స్ బిజీగా పనిచేసి పనిని వేగంగా పూర్తి చేస్తారని నందిని రెడ్డి తెలిపారు.

సినిమా రిలీజ్‌ ముందు హడావిడి అందుకే.. ఇండస్ట్రీ టాప్ సీక్రెట్ బయటపెట్టిన నందిని రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన మహిళా దర్శకురాళ్లలో నందిని రెడ్డి ఒకరు. ఈమె తాజాగా సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి దర్శకత్వం వహించింది. ఈ సినిమా జూన్ 19న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నందిని రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమెను “మీ సినిమా జూన్ 19న విడుదల కానుంది కదా? ప్రస్తుతం రిలీజ్ హడావిడిలో ఉన్నారా?” అని ప్రశ్నించారు. దానికి ఆమె “అవును, ప్రస్తుతం రిలీజ్ హడావిడిలో ఉన్నాం” అని సమాధానమిచ్చారు. అనంతరం “ఇటీవలి కాలంలో దర్శకులు రిలీజ్ ముందు ఇలాంటి హడావిడి ఎందుకు చేస్తున్నారు?” అనే ప్రశ్న కూడా ఎదురైంది.

దీనికి నందిని రెడ్డి స్పందిస్తూ, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాతే టెక్నీషియన్స్ అందరూ బిజీగా పనిచేస్తూ తమ పనిని వేగంగా పూర్తి చేస్తారని చెప్పారు. రిలీజ్ డేట్ ప్రకటించకముందు పని కొంత కూల్‌గా సాగుతుందని, కానీ డేట్ ఫిక్స్ అయిన తర్వాత పనులు వేగవంతమవుతాయని ఆమె తెలిపారు. ఒకవేళ చాలా ముందే పూర్తి అవుట్‌పుట్ ఇస్తే, మళ్లీ ఏదో మార్పులు చేయాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే చివరి దశలో పనులు పూర్తిచేస్తారని ఆమె పేర్కొన్నారు. అందుకే రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ హడావిడి పెరుగుతుందని నందిని రెడ్డి వివరించారు. ఈ దర్శకురాలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Next Story