పొగాకు రహిత సమాజం కోసం అడుగులు.. అపోలో హాస్పిటల్స్ ‘పేషెంట్ కనెక్ట్’ వాకథాన్!

by Jakkula.Mamatha |

ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పాతబస్తీలోని అపోలో డీఆర్‌డీవో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్ & పేషెంట్ కనెక్ట్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది.

పొగాకు రహిత సమాజం కోసం అడుగులు.. అపోలో హాస్పిటల్స్ ‘పేషెంట్ కనెక్ట్’ వాకథాన్!
X

దిశ, చంపాపేట్: ప్రజల్లో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ పాతబస్తీలోని అపోలో డీఆర్‌డీవో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకథాన్ & పేషెంట్ కనెక్ట్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది. 2వ నేషనల్ సర్జన్స్ వీక్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వైద్యులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలు విశేషంగా హాజరయ్యారు. అపోలో డీఆర్‌డీవో ఆస్పత్రి ప్రాంగణం నుంచి ప్రారంభమైన వాకథాన్‌లో పాల్గొన్నవారు ఆరోగ్య పరిరక్షణ, పొగాకు వ్యతిరేక నినాదాలతో ముందుకు సాగారు. క్రమం తప్పకుండా నడక, వ్యాయామం, సమతుల్య ఆహారం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు అనేక వ్యాధులను దూరం చేస్తాయని వైద్య నిపుణులు వివరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వైద్యులు.. పొగాకు వినియోగం కారణంగా క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదం అధికంగా ఉంటుందని హెచ్చరించారు. ముఖ్యంగా యువత పొగాకు, ధూమపానానికి దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవర్చుకోవాలని సూచించారు. పేషెంట్ కనెక్ట్ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సంబంధిత సందేహాలకు వైద్యులు సమాధానాలు ఇచ్చి, వ్యాధుల నివారణలో ముందస్తు జాగ్రత్తల ప్రాధాన్యతను వివరించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాకుండా ఆరోగ్యంపై చైతన్యం కల్పించడం కూడా తమ సామాజిక బాధ్యతలో భాగమని ఆస్పత్రి ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభించిన ఈ కార్యక్రమం “ఆరోగ్యమే మహాభాగ్యం – పొగాకుకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి” అనే సందేశాన్ని సమాజానికి చేరవేస్తూ విజయవంతంగా ముగిసింది.

Next Story