- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపాలలో గాలివాన బీభత్సం.. ఎగిరిపడ్డ ఇంటిపైకప్పు రేకులు.. ముగ్గురికి గాయాలు
by Jakkula.Mamatha |
మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది.

X
దిశ, మునగాల: మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. గ్రామంలో నివాసం ఉంటున్న మోతుకూరి వెంకన్న చారి రెండు రోజుల క్రితమే ఇంటి నిర్మాణం రేకులు పైకప్పు వేసుకోగా గాలివాన బీభత్సానికి రేకులు మొత్తం పూర్తిగా లేచి కింద పడిపోవడంతో కుటుంబంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ ఉప సర్పంచ్ తుమ్మ సతీష్ గాయపడిన కుటుంబ సభ్యులకు ప్రథమ చికిత్స చేయించారు. పూర్తిగా ధ్వంసమైన ఇల్లును పరిశీలించి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. తక్షణ సాయం కింద లక్ష రూపాయలు అందించాలని, వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Next Story






