నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం

by Jakkula.Mamatha |

అక్రమంగా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన నిషేధిత హెచ్‌టీ కాటన్(BG-III) పత్తి విత్తనాలను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిషేధిత పత్తి విత్తనాలు స్వాధీనం
X

దిశ, షాద్ నగర్: అక్రమంగా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన నిషేధిత హెచ్‌టీ కాటన్(BG-III) పత్తి విత్తనాలను ఎస్‌ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఫరూఖ్ నగర్ మండలం లాల్‌సింగ్ తండాలోని ఓ ఇంట్లో నిషేధిత హెచ్‌టీ కాటన్ (BG-III) పత్తి విత్తనాలను నిల్వచేశారని విశ్వసనీయ సమాచారం మేరకు గురువారం షాద్ నగర్ ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తండాలోని పల్త్యావత్ కవిత నివాసంలో ఒక సంచిలో దాచిన 52 ప్యాకెట్లలో సుమారు 22.8 కిలోల నిషేధిత పత్తి విత్తనాలు లభ్యమయ్యాయి. ప్యాకెట్ల పై కంపెనీ పేరు, విత్తనాల వివరాలు లేవు.

విత్తనాల గురించి విచారించగా, కొందుర్గు మండలం పాత అగిర్యాల గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ తన ఇంట్లో ఈ విత్తనాలను దాచమని ఇచ్చిందని, కొంత డబ్బు వస్తుందనే ఆశతో వాటిని తన ఇంట్లో నిల్వ ఉంచినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది. స్వాధీనం చేసుకున్న నిషేధిత విత్తనాలను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకుని ల్యాబ్ పరీక్షల కోసం షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఫరూఖ్‌నగర్ మండల ఇన్‌చార్జ్ వ్యవసాయ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story