నగరం నడిబొడ్డున దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-26 04:29:24  IST  )

మహానగర పరిధిలో నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు.

నగరం నడిబొడ్డున దారుణం.. భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త
X

దిశ,‌ వెబ్‌డెస్క్: మహానగర పరిధిలో నేరాలకు ఏమాత్రం అడ్డుకట్ట పడటం లేదు. వరుస హత్యలు, కాల్పులు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో నగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్, త్రివేణి దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకుని నల్లకుంట (Nallakunta) పరిధిలో నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలు, అనుమానం కారణంగా వారిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల భర్త వేధింపులు తాళలేక ఇటీవల త్రివేణి పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చింది.

అయితే, కోపంతో రగిలిపోతున్న భర్త వెంకటేశ్ (Venkatesh) భార్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన వెంట బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను భార్యపై పోసి పిల్లల ఎదుటే నిప్పంటించాడు. అడ్డుకోబోయిన కూతురుని సైతం మంటల్లోకి తోసి అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు స్పాట్‌కు వెళ్లి చూసేసరికి కాలి బూడిదై మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇక కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. అనంతరం రెండు బృందాలను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుడు వెంకటేశ్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Related News : అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి, 32 మందికి గాయాలు

Next Story