అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి, 32 మందికి గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-26 04:21:31  IST  )

క్రిస్మస్ పండుగల వేళ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటన మెక్సికోలోని వెరాక్రూజ్ రాష్ట్రంలో జరిగింది.

అదుపుతప్పి లోయలో పడిన బస్సు.. 10 మంది మృతి, 32 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: క్రిస్మస్ పండుగల వేళ బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటన మెక్సికోలోని వెరాక్రూజ్ రాష్ట్రంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మెక్సికో సిటీ నుంచి చికోంటెపెక్ గ్రామానికి వెళ్తున్న బస్సు జోంటెకోమట్లాన్ పట్టణం సమీపంలో అతివేగంతో అదుపు తప్పి పక్కనే ఉన్న భారీ లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, 32 మందికి గాయాలయ్యాయి. మరణించిన వారిలో 9 మంది పెద్దలు, ఒక చిన్నారి ఉన్నారని అధికారులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు స్పాట్‌కు చేరుకున్న పోలీసులు 32 మంది గాయగ్రస్తులను వివిధ ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. మున్సిపాలిటీ అధికారులు గాయపడిన వారి జాబితాను కూడా విడుదల చేశారు. అయితే, క్రిస్మస్ సీజన్‌లో జరిగిన ఈ విషాదకర ఘటన అక్కడి ప్రజల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఇటీవల కాలంలో మెక్సికోలో బస్సు, ట్రక్కులతో జరిగే ఘోర రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. డ్రైవర్ల అతివేగం, సాంకేతిక కారణాల వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాగా, నవంబరు చివరి వారంలో పశ్చిమ రాష్ట్రమైన మిచోకాన్‌లో కూడా ఒక బస్సు ప్రమాదంలో 10 మంది మరణించగా, మరో 20 మంది గాయపడిన విషయం తెలిసిందే.

Next Story