'నా కూతురు అమాయకురాలు.. ఆమె తల్లే చెడగొట్టింది': అషురెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-26 09:33:17  IST  )

ఎన్నారై ఐటీ ఉద్యోగిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి వ్యవహారంలో ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.

నా కూతురు అమాయకురాలు.. ఆమె తల్లే చెడగొట్టింది: అషురెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నారై ఐటీ ఉద్యోగిని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి వ్యవహారంలో ఆమె తండ్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. తన కూతురు చేసిన తప్పులకు తన భార్యనే కారణమని, అషురెడ్డిని ఆమె తల్లే చెడగొడుతోందని ఆయన బాహాటంగా విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. "అషు తన తల్లి చెప్పినట్లే వింటుంది. ఆమె తల్లే అషును చెడగొడుతోంది. అషును పూర్తిగా మార్చేసింది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు చేసిన ధర్మేంద్రకు ఇదివరకే పెళ్లి అయ్యిందన్న విషయం తెలిసినప్పటికీ.. అషురెడ్డి అతనితో పెళ్లికి సిద్ధపడిందని ఆయన ధృవీకరించారు. ధర్మేంద్ర నుంచి అషురెడ్డి డబ్బులు తీసుకున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.

కాల్ మనీ సంబంధాలు..

ధర్మేంద్ర కుటుంబానికి 'కాల్ మనీ' కేసులతో సంబంధాలు ఉన్నాయని అషురెడ్డి తండ్రి సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు అమాయకురాలని, తెలియక ఈ ఊబిలో చిక్కుకుందని చెప్పుకొచ్చారు. "నా కూతురు చేసిన తప్పులకు తండ్రిగా నేనూ శిక్ష అనుభవించాల్సిందే. ఈ పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉంది" అని ఆయన వాపోయారు. ఒకవైపు కోట్ల రూపాయల వసూళ్ల ఆరోపణలు, మరోవైపు తండ్రే స్వయంగా తన భార్యపై, కూతురిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి సుమారు రూ. 9.35 కోట్లు వసూలు చేసిందని ధర్మేంద్ర అనే వ్యక్తి హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో అషురెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రి వ్యాఖ్యలు ఈ కేసులో పోలీసుల విచారణకు కీలక సమాచారంగా మారే అవకాశం ఉంది.

రూ.9.35 కోట్ల మోసం కేసుపై స్పందించిన అషు.. లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ స్ట్రాంగ్ వార్నింగ్

Next Story