రూ.9.35 కోట్ల మోసం కేసుపై స్పందించిన అషు.. లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ స్ట్రాంగ్ వార్నింగ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-26 09:34:09  IST  )

నా అనుమతి లేకుండా నా గురించి ప్రచారంలో ఉన్న ఏ వార్త లేదా తప్పుడు సమాచారంపై నైనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. దయచేసి ఎదుటివారి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించండి

రూ.9.35 కోట్ల మోసం కేసుపై స్పందించిన అషు.. లీగల్ యాక్షన్ తీసుకుంటానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, సినిమా: బుల్లితెర నటి, బిగ్‌బాస్ ఫేమ్ అషు రెడ్డిపై రూ. 9.35 కోట్ల భారీ మోసం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లి పేరుతో ఒక యువకుడిని నమ్మించి, 5 కిలోల బంగారంతో పాటు కోట్లాది రూపాయల ఆస్తులు కాజేసిందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. బాధితుడి కుటుంబం సైబర్ పోలీసులను ఆశ్రయించి, అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై చీటింగ్ కేసు పెట్టినట్లు వస్తున్న వార్తలతో నెట్టింట పెద్ద దుమారమే రేగింది. అవి కాస్త అషు కంట పడటంతో.. ఈ ఆరోపణలు, తనపై జరుగుతున్న ప్రచారంపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. తనపై వస్తున్నవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేస్తూ.. గట్టి హెచ్చరిక జారీ చేశారు. "నా అనుమతి లేకుండా నా గురించి ప్రచారంలో ఉన్న ఏ వార్త లేదా తప్పుడు సమాచారంపై నైనా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. దయచేసి ఎదుటివారి వ్యక్తిగత జీవితాన్ని గౌరవించండి" అని ఆమె రాసుకొచ్చారు.

అషు రెడ్డి ఈ పోస్ట్‌తో తనపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని పరోక్షంగా స్పష్టం చేశారు. కేవలం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మరోవైపు, బాధితులు మాత్రం అషు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిందని, 2018 నుండి 2025 మధ్య కాలంలో విడతల వారీగా డబ్బులు, బంగారం తీసుకుందని ఆరోపిస్తున్నారు. అషు రెడ్డి పోస్ట్‌పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తుంటే, మరికొందరు మాత్రం "మరి ఆ రూ. 9 కోట్లు, బంగారం సంగతి ఏంటి?" అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు కాబట్టి, నిజానిజాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అషు రెడ్డి ఈ వివాదంపై చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

'నా కూతురు అమాయకురాలు.. ఆమె తల్లే చెడగొట్టింది': అషురెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్

Next Story