- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో దారుణం.. భర్తను చంపేసిన భార్య.. ఆ తర్వాత ఇంట్లోనే కాల్చేసి.. చివరికి!?
ప్రస్తుత సమాజంలో చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తుంటే సమాజం ఎటుపోతుంది?

దిశ,వెబ్‌డెస్క్: ప్రస్తుత సమాజంలో చోటుచేసుకుంటున్న ఘటనలు చూస్తుంటే సమాజం ఎటుపోతుంది? మానవత్వం జాడ కనిపించడం లేదనే భావన కలుగుతోంది. రోజురోజుకు మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి. ఇక, చివరి వరకు ఒకటిగా కలిసి బతుకుదాం అని ఏడు అడుగులతో ప్రారంభించిన భార్యాభర్తల బంధం లో దారుణమైన ఘటనలు వెలుగుచూస్తున్నాయి. చిన్న చిన్న కారణాలతో భార్యను లేదా భర్తను వదిలించుకోవాలనే ఆలోచనతో ప్రాణాలను సైతం తీసేస్తున్నారు. ఈ తరుణంలో ప్రస్తుత కాలంలో కనీస మానవత్వం లేకుండా భార్య, భర్తలే హత్యలు చేసుకుంటున్న దారుణమైన పరిస్థితులు చోటుచేసుకోవడం గమనిస్తూనే ఉన్నాం. ఒక ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగు చూడటం తీవ్ర కలకలం రేపుతోంది.
తాజాగా ఏపీలో రెండు దారుణమైన ఘటనలు వెలుగు చూశాయి. పశ్చిమగోదావరి జిల్లాలో భర్తను ఓ భార్య టార్చ్‌లైట్‌తో కొట్టి చంపేసింది. పెనుగొండ మండలం కొట్టాలపర్రు శివారు వీరప్ప చెరువులో ఈ దారుణం జరిగింది. వెంకటనారాయణ అనే వ్యక్తి గల్ఫ్ నుంచి గత వారం క్రితం వచ్చారు. అయితే అతడు పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడని భార్య అనంతలక్ష్మి టార్చ్‌లైట్‌తో కొట్టి చంపేసింది. కాగా మృతుడు మొదటి భార్య చనిపోవడంతో కొన్నేళ్ల క్రితం అనంత లక్ష్మి ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. కర్నూలు జిల్లాలో భార్య కట్టుకున్న భర్తను చంపి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లాలోని మద్దికేర మండలం ఎం.అగ్రహారం గ్రామంలో చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం భర్త వెంకటేష్‌ను చంపేసి.. అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే కాల్చినట్లుగా సమాచారం. స్థానికులు ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, స్థానికంగా కలకలం రేపిన ఈ హత్య ఘటన పై గ్రామస్తుల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ఆస్తి కోసమే భార్య చంపేసిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెళ్లి తరవాత మరో యువకుడితో కూతురు ఎఫైర్.. ఇద్దరినీ కొట్టి చంపిన తండ్రి






