- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెళ్లి తరవాత మరో యువకుడితో కూతురు ఎఫైర్.. ఇద్దరినీ కొట్టి చంపిన తండ్రి
మహారాష్ట్రలో పరువు హత్య కలకలం రేపింది. నాందేడ్‌లోని గోలేగావ్ గ్రామానికి చెందిన చెందిన సంజీవని అనే యువతికి ఇప్పటికే వివాహం అవ్వగా అత్తగారి ఇంటి వద్దనే ఉంటోంది.

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలో పరువు హత్య కలకలం రేపింది. నాందేడ్‌లోని గోలేగావ్ గ్రామానికి చెందిన చెందిన సంజీవని అనే యువతికి ఇప్పటికే వివాహం అవ్వగా అత్తగారి ఇంటి వద్దనే ఉంటోంది. అయితే సంజీవని లఖన్ భండారే అనే యువకుడితో అక్రమ సంబంధం ఉండగా సోమవారం అతడు ఇంటికి వచ్చాడు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగా యువతి అత్తింటివారు, ఆమె భర్త చూసి పట్టుకున్నారు.
అనంతరం యువతి తండ్రికి సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని వారిపై దాడి చేశారు. మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి యువతి తండ్రి దాడి చేయడంతో ప్రియుడితో పాటు సంజీవని సైతం మరణించింది. అనంతరం ఇద్దరి మృతదేహాలను అక్కడే ఉన్న ఓ పెద్ద బావిలో పడేశారు. ఋ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సమాచారం అందిన వెంటనే ఎస్సై అర్చన పాటిల్, ఇతర పోలీస్ అధికారులు అక్కడకు వెళ్లి నిందితులను అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.
Read More : రాష్ట్రంలో మరో దారుణం.. భర్తను చంపేసిన భార్య.. ఆ తర్వాత ఇంట్లోనే కాల్చేసి.. చివరికి!






