అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట! నాంపల్లి కోర్టుకు 100 పేజీల నివేదిక సమర్పణ

by Ramesh Naini |   (  Updated:2025-12-27 10:59:24  IST  )

‘పుష్ఫ-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు.

అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట! నాంపల్లి కోర్టుకు 100 పేజీల నివేదిక సమర్పణ
X

దిశ, సిటీ క్రైం: ‘పుష్ఫ-2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేశారు. ఇందులో సినీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పాటు 23 మందిపై అభియోగాలు మోపారు. ఈ చార్జిషీట్‌లో అల్లు అర్జున్‌ ఏ-11గా ఉన్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు. ఈ మేరకు థియేటర్ అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్ల పేర్లే చార్జిషీట్‌లో చేర్చారు. ఈ మేరకు నాంపల్లి న్యాయస్థానానికి 100 పేజీల చార్జిషీట్‌ను పోలీసులు సమర్పించారు. ఇందులో అల్లు అర్జున్‌పై నేర అభియోగాలు మోపడంతో శిక్ష తప్పదా అన్న చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది.

ఐకాన్ స్టార్‌ చేయి ఊపడం వల్లే..!

గత ఏడాది డిసెంబర్‌ 4న రాత్రి ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్‌ షో కోసం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌‌కు అల్లు అర్జున్ రావడం తొక్కిసలాటకు కారణమని పోలీసులు తేల్చారు. ఆయన సినిమా టాకీస్ వద్దకు రాగానే కారు రూఫ్ ఎక్కి చెయ్యి ఊపుతూ అభివాదం చేయడం వల్ల ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలో మహిళ రేవతి (35) ప్రాణాలు కోల్పోగా ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో 2024 డిసెంబర్ 13న నటుడు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత అతడిని నాంపల్లి కోర్టుకు తరలించగా న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే, అదే రోజు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మరుసటి రోజు ఉదయం ఆయన విడుదలైన విషయం తెలిసిందే.

Read More..

CP Sajjanar: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. సీపీ సజ్జనార్ కీలక విషయాలు పోస్ట్

హీరో అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. పుష్పా-2 తొక్కిసలాటపై ఛార్జిషీట్

Next Story