CP Sajjanar: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. సీపీ సజ్జనార్ కీలక విషయాలు పోస్ట్

by Ramesh Naini |   (  Updated:2025-12-27 10:28:16  IST  )

‘పుష్పా-2’ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై తాజాగా చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు.

CP Sajjanar: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. సీపీ సజ్జనార్ కీలక విషయాలు పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ‘పుష్పా-2’ సినిమా (Pushpa-2) విడుదల సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాటపై తాజాగా చిక్కడపల్లి పోలీసులు (Chikkadpally Police) ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కీలక విషయాలు వెల్లడించారు. శుక్రవారం ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో దర్యాప్తు పూర్తి అయిందని సీపీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 24న కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారని ఆయన స్పష్టం చేశారు.

కాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన సినిమా పుష్పా-2 (2024 డిసెంబర్ 4) రాత్రి 9:30 గంటల సమయంలో బెనిఫిట్‌ షో కోసం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్దకు వచ్చిన హీరో అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో తొక్కిసలాటలో రేవతి(35) అనే మహిళ మృతిచెందగా ఆమె కుమారుడు శ్రీతేజ(9) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు కారణంగా భావిస్తున్న మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. ఛార్జిషీట్‌లో ఏ-11గా నటుడు అల్లు అర్జున్‌ పేరు చేర్చారు. ట్వీట్ ఇదే..

Read More..

హీరో అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. పుష్పా-2 తొక్కిసలాటపై ఛార్జిషీట్

Next Story