- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో అల్లు అర్జున్‌కు బిగ్ షాక్.. పుష్పా-2 తొక్కిసలాటపై ఛార్జిషీట్
హీరో అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ తగిలింది...

దిశ, వెబ్ డెస్క్: హీరో అల్లు అర్జున్(Allu Arjun)కు బిగ్ షాక్ తగిలింది. ‘పుష్పా-2’ సినిమా(‘Pushpa-2’ movie) విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్(Hyderabad Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిలాటపై తాజాగా చిక్కడపల్లి పోలీసులు(Chikkadapalli Police) ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జిషీట్‌లో అల్లు అర్జున్‌ను ఏ11గా పేర్కొన్నారు. ఇక సంధ్య థియేటర్ మేనేజ్మెంట్‌ను ఏ1గా చేర్చారు. ఈ కేసులో మొత్తం 23 మందిపై ఛార్జిషీట్ నమోదు చేశారు. అల్లు మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో పాటు 8 మంది బౌన్సర్లను ఛార్జిషీట్‌లో దాఖలు చేశారు. అసలు ఈ ఘటన సంధ్య థియేటర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని నిర్ధారించారు. ఈ మేరకు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు.
‘పుష్పా-2’ మూవీ రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసటలో మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. సుధీర్ఘకాలం చికిత్స పొందిన తర్వాత బాలుడు డిశ్చార్జి అయ్యారు. చికిత్సకు అయిన ఖర్చు మొత్తం హీరో అల్లు అర్జున్ కుటుంబమే చూసుకుంది. తాజాగా ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు కావడం అభిమానులను టెన్షన్‌లోకి నెట్టింది.
Read More..
టికెట్ ధరలు ఎక్కువనిపిస్తే సినిమాలు చూడకండి.. ఐబొమ్మ ఇష్యూపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు






