- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టికెట్ ధరలు ఎక్కువనిపిస్తే సినిమాలు చూడకండి.. ఐబొమ్మ ఇష్యూపై ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
పైరసీ సినిమాలను ఐబొమ్మ వెబ్ సైట్ ద్వారా ప్రసారం చేసిన ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవి ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: పైరసీ సినిమాలను ఐబొమ్మ వెబ్ సైట్ ద్వారా ప్రసారం చేసిన ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రవి ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సినిమాలను పైరసీ చేయడంతో పాటు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సహా పలు సెక్షన్ల కింద రవిపై కేసులు నమోదయ్యాయి. అయితే ఉచితంగా సినిమాలను వెబ్ సైట్ లో ప్రసారం చేయడంతో చాలా మంది ఆ సినిమాలు చూశారు. సినిమా టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకాయని రవి మంచిపని చేశాడని అతడిని మెచ్చుకున్నారు.
రవి హీరో అంటూ చాలా మంది సోషల్ మీడియాలో పొగడ్తలు కురిపించారు. అయితే తాజాగా ఈ ఇష్యూపై నటుడు ప్రకాష్ రాజ్ మీడియా సమావేశంలో కీలకవ్యాఖ్యలు చేశారు. దొంగతనం ఎవరు చేసినా తప్పే అని దొంగతనం చేసిన వాడు హీరో ఎలా అవుతాడని ప్రశ్నించారు. సినిమా టికెట్ ధరలు ఎక్కువ అనిపిస్తే చూడటం మానేయాలని అన్నారు. అది ఒక వ్యాపారం అని ఏదైనా వ్యాపారం కాబట్టి ఇష్టం ఉంటేనే చూడాలని చెప్పారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Read More..






