- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శివాజీపై పోరాటం.. అనసూయకు ప్రకాష్ రాజ్ మద్దతు
by Muthe.Rajitha |
ఇటీవల 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ మహిళలపై చేసిన కామెంట్లు పెను దుమారాన్ని రేపాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల 'దండోరా' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు శివాజీ మహిళలపై చేసిన కామెంట్లు పెను దుమారాన్ని రేపాయి. మహిళాలోకం అంతా శివాజీని సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు. అయితే శివాజీ నటి అనసూయపై విమర్శించడం పట్ల ఆమె మరింత ఫైర్ అయ్యారు. ఎవరు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరు ఎవరంటూ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వీరి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. నటుడు, జనసేన నేత నాగబాబు, బిందు మాధవి, గాయని చిన్మయి అనసూయకు బాసటగా నిలిచారు. తాజాగా నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాష్ రాజ్ కూడా అనసూయకు మద్దతుగా నిలిచాడు. "సంస్కారులమని చెప్పుకునే వాళ్ళు ఎంతైనా మొరగనివ్వు. అది వాళ్ళ కుంచిత మనస్తత్వం. మేమంతా నీతోనే ఉంటాం" అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు నటుడు శివాజీ నేడు తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.
Next Story






