- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి..
ముందు వెళ్తున్న బైకును వెనుక నుంచి అతివేగంగా అజాగ్రత్తగా కారు నడుపుతున్న వ్యక్తి బైక్ ను బలంగా ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న గుండా నరేష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు.

దిశ, కౌడిపల్లి: ముందు వెళ్తున్న బైకును వెనుక నుంచి అతివేగంగా అజాగ్రత్తగా కారు నడుపుతున్న వ్యక్తి బైక్ ను బలంగా ఢీకొట్టడంతో బైక్ నడుపుతున్న గుండా నరేష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. నేడు మధ్యాహ్నం మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంకు చెందిన గుండా నరేష్(30) జీడిమెట్ల సూరారం నుంచి (TS-35-D 8314) నంబర్ గల బైక్ పై హవేలీ ఘనపూర్ కు వెళ్తున్నాడు.TS -08-KB 6770 నంబర్ గల కారును అతివేగంగా అజాగ్రత్తగా వెనకాల నుంచి బలంగా ఢీ కొట్టాడు. దీంతో నరేష్ స్పాట్లోనే మరణించాడు. మృతి చెందిన నరేష్ కు అదే గ్రామానికి చెందిన ప్రవళికతో అయిదారు మాసాల క్రితం పెళ్లి జరిగింది. మృతునికి తండ్రి లేడు. తల్లి గంగమ్మ ఉన్నారు. ఘటన స్థలానికి స్థానిక పోలీసులు చేరుకొని 108 వాహనంలో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు.
Read More..






