బైక్‌ను ఢీకొట్టిన సిమెంట్ ట్యాంకర్.. తండ్రి, కూతురు స్పాట్ డెడ్

by Jakkula.Mamatha |   (  Updated:2025-08-25 14:20:03  IST  )

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.

బైక్‌ను ఢీకొట్టిన సిమెంట్ ట్యాంకర్.. తండ్రి, కూతురు స్పాట్ డెడ్
X

దిశ, చేవెళ్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. హాస్టల్ నుంచి తల్లి వద్దకు చేరాల్సిన కూతుర్ని మృత్యువు వెంటాడిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చేవెళ్ల పట్టణ కేంద్రంలోని రాజేందర్ రెడ్డి విగ్రహం సమీపంలోని కూరగాయల షాప్ ముందు సిమెంట్ ట్యాంకర్ లారీ బైక్‌ను ఢీకొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండలంలోని బిరెల్లి గ్రామానికి చెందిన తాండ్ర రవీందర్ (32), కృప (13)లుగా పోలీసులు గుర్తించారు.

మొయినాబాద్ మండలంలోని తొల్కట గ్రామం లో ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న తన కూతురిని తీసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో చేవెళ్ల పట్టణ కేంద్రంలో కి రాగానే వెనుక నుంచి సిమెంట్ ట్యాంకర్ లారీ ఢీ కొట్టిందిని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపారు. హాస్టల్ నుంచి తల్లి చెంతకు చేరాల్సిన కూతురు మృత్యువు చెంతకు చేరడం తో తీవ్ర బాధాకరమైన ఘటన చోటు చేసుకుంది. మృతుడు రవీందర్ కి కుమారుడు, భార్య ఉంది.

Also Read.

మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన లెక్చరర్..కేసు నమోదు

Next Story